
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ శాసనసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ భాగస్వామ్య పార్టీ యంసిపిఐ(యు) పోటి చేస్తున్నదని యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ శనివారం సంయుక్తంగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో యంసిపిఐ(యు) కేంద్ర కమిటీ సభ్యులు, అఖిలభారత ప్రజా తంత్ర యువజన సమాఖ్య (AIFDY) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , బి యల్ యప్ రాష్ట్ర కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్న కామ్రేడ్ వనం సుధాకర్ ను అభ్యర్థిగా ప్రకటించారు. కామ్రేడ్ వనం సుధాకర్ కు బి యల్ యప్ భాగస్వామ్య పక్షాలే కాకుండా వామపక్ష, సామాజిక ప్రజాస్వామిక, లౌకిక శక్తులు సంఘాలు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
……………………………………….