
ర్యాపిడో డ్రైవర్.. డాక్టర్ దుర్మరణం
* లారీని ఢీకొట్టిన బైకు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పంజాగుట్టలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. స్థానికుల సమచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన ఎం.నవీన్ జేఎన్టీయూ సమీపంలోని నివాసం ఉంటూ ర్యాపిడో నడుపుతూ జీవనం పొందుతున్నాడు. విధుల్లో భాగంగా డాక్టర్ కస్తూరి జగదీష్ చంద్రను సికింద్రాబాద్కు తీసుకెళ్తుండగా గ్రీన్ ల్యాండ్స్ సమీపంలో ప్రమాదం జరిగింది. నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. డాక్టర్ జగదీష్ కు తీవ్రగాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించంతో మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
……………………………………….