
* ఇటుక పెట్టలే ..ఇల్లు కట్టలే..
*ఉన్న ఇండ్లు కూలకొడుతున్నారు
* బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో ఒక్క ఇటుక పెట్టింది లేదు.. ఒక్క ఇల్లు కట్టింది లేదు అని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో షేక్‌పేట, జూబ్లీహిల్స్ కు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ ఎస్ లో చేరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి (REVANTH REDDY)హైడ్రాపేరుతో ఉన్న ఇండ్లు కూలగొడుతూ పేదలకు గూడు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. షేక్ పేట (SHEK PETA) జూబ్లీహిల్ష్ (JUBLEE HILLS) ప్రజలు కారు కావాలో బుల్డోజర్లు కావాలో నిర్ణయించుకోవాలని సూచించారు.కాంగ్రెస్ నాయకులకు కోర్టులన్నా, చట్టాలన్నా గౌరవం లేదని అన్నారు. పేదల ఇళ్లను ఇష్టం వచ్చినట్లుగా చట్టానికి వ్యతిరేకంగా కూల గొడుతున్నారని అన్నారు. హఠాత్తుగా పేదల ఇండ్లపై దాడి చేస్తూ ఇంట్లో ఉన్న సామానులను బయల పడేస్తున్నారని అన్నారు.వంటసామానుతో పాటు పిల్లలు చదువుకునే పుస్తకాలను కూడా బుల్డోజర్లతో బయటకు విసురుతున్నారని విమర్శించారు. రోడ్డు మీద ఉన్న వాహనాలను ఎత్తి అవతల పడేస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలకు సేవచేసిన మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతను ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
…………………………………………….