
* బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు
ఆకేరున్యూస్ హనుమకొండ: హనుమకొండ కలెక్టరేట్ లో తోటి ఉద్యోగిని పై అత్యాచారానికి యత్నించిన
ఇర్ఫాన్ సోహైల్ అనే ఉద్యోగిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నఇర్ఫాన్ సోహైల్ కొంత కాలంగా మహిళా సిబ్బందిని లైంగికంగా వేధిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఓ మహిళా ఉద్యోగిపై అత్యాచార యత్నానికి పాల్పడడంతో సదరు మహిళ సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇర్ఫాన్ సోహైల్‌పై పోలీసులు లైంగిక వేధింపుల కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అలాగే నిందితుడిని కలెక్టర్ సస్పెండ్ చేశారు.కాగా ఇర్ఫాన్ సోహైల్ కు ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.
………………………………………..