
* అధికారులకు అత్యవసర ఆదేశాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కీలక సమావేశం నిర్వహించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ విభాగాల పనితీరు, పథకాల అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. అకౌంటబిలిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ (Cm Revanth) ఆదేశించారు. హాస్టళ్లలో విద్యార్థులు, సిబ్బందిని ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్ పరిధిలోకి తీసుకురావాలన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని అన్నారు. టెక్నాలజీ సాయంతో భోజనం నాణ్యత పరిశీలించాలని తెలిపారు. మౌలిక వసతులపై ఆన్ లైన్ లో డేటా అప్లోడ్ చేయాలన్నారు. తరచూ హాస్టళ్లలో హెల్త్ చెకప్స్ చేయాలని సూచించారు. విద్యా వ్యవస్థ పటిష్టానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయం ప్రజలకు తెలిసేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఇందుకోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వివిధ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
…………………………………………………