
* మంత్రి పదవికి రాజీనామా చేయనున్న సురేష్ గోపి..?
* పార్టీ అధిష్టానానికి నిర్ణయం తెలిపిన సురేష్ గోపి
* సదానందన్ ను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని సూచన
ఆకేరు న్యూస్ డెస్క్ : మళయాల హీరో కేరళ (KERALA) నుంచి బీజేపీ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి వర్గంలో పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ స్టేట్ మినిస్టర్ గా వ్యవహరిస్తున్న సురేష్ గోపి( SURESH GOPI) కేంద్ర మంత్రి వర్గం నుంచి వైదొలగే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పార్టీ అధిష్టానానికి తెలియజేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపధ్యంలో సినిమాలకు దూరంగా ఉన్న సురేష్ గోపి మళ్లీ సినిమాల్లో నటించ బోతున్నారు. సినిమాలకు దూరం కావడంతో ఆదాయం కోల్పోయానని తనకు ప్రస్తుతం ఆదాయం కావాలని అందుకే మంత్రి వర్గం నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు,తన పిల్లలు ఇంకా స్థిరపడలేదని ఈ పరిస్థితుల్లో డబ్బు సంపాదించడం ముఖ్యమని సురేష్ గోపి భావిస్తున్నారు. తన స్థానంలో రాజ్య సభ్యుడు సదారందన్ మాస్టర్ ( SADANANDAN MASTER) ను మంత్రి వర్గంలోకి తీసుకోవల్సిందిగా కోరారట, 1994 లో సీపీఎం కార్యకర్తల దాడిలో సదారందర్ మాస్టర్ రెండు కాళ్లను కోల్పోయారు. 2016లో బీజేపీలో చేరిన సురేష్ గోపి మొదట రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత 2024లో కేరళ లోని త్రిస్సూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నకయ్యారు. తెలుగు,తమిళ , మళయాళ, హిందీ భాషల్లో దాదాపు 200 సినిమాలు నటించిన సురేష్ గోపికి యాక్షన్ హీరోగా మంచి పేరుంది. 90 వ దశకంలో హీరోగా ఓ వెలుగు వెలిగాడు.
………………………………………………………