
* యూనిఫాం వేసుకున్న వారు అవినీతికి దూరంగా ఉండాలి
*పోలీసులకు డీజీపీ శివధర్ రెడ్డి సూచన
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : పోలీసులు సివిల్ కేసులకు దూరంగా ఉండాలని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన పోలీసు సిబ్బందికి లేఖ రాశారు. సివిల్ వివాదాల కోసం సివిల్ కోర్టులు ఉన్నాయని సివిల్ వివాదాలను పోలీస్ స్టేషన్లలోకి రానివ్వద్దని సూచించారు. యునిఫాం వేసుకున్న ప్రతీ ఒక్కరూ అవినీతికి దూరంగా ఉండాలని పేర్కొన్నారు. ఏ ఒక్క అధికారి లంచం తీపుకున్నా మొత్తం పోలీస్ శాఖకే చెడ్డపేరు వస్తుందని డీజీపీ లేఖలో పేర్కొన్నారు. కేసుల పరిష్కారం విషయంలో టెక్నాలజీని వాడుకోవాలని సూచించారు. ప్రజలకు సేవ చేయడంలో ముందుండాలని ముఖ్యంగా పేద ప్రజలకు సేవ చేసేందుకు అధిక ప్రాధాన్యమివ్వాలని కోరారు. పేద ప్రజలకు సహాయం చేస్తే వారు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.
…………………………………………..