
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
* కిషన్ రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్న
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతుందని ప్రజలు అడుగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారా లేక బీఆర్ ఎస్ ను గెలిపిస్తున్నారా అంటూ కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.మీరు భారీ ఓట్లతోని ఓడిపోతే కేంద్రంలోని పెద్దలకు మీ ముఖం ఎలా చూపిస్తారని ప్రశ్నించారు. నా జిల్లాను సర్వనాశనం చేసి నన్ను బయటకు పంపించారు. ఏదో ఒక్క రోజు మీరు కూడా అలాంటి పరిస్థితి వస్తుందని అన్నారు. అయితే గతంలో కూడా ఈ ఇద్దరి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెల్సిందే..
……………………………………………..