బీజేపీ ఎంపీ బండి సంజయ్
* సెకండ్ హ్యాండ్లో కూడా ఎవరూ కొనరు!
* కేటీఆర్‌పై బండి సంజయ్ కామెంట్స్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బీఆర్ ఎస్పై విరుచుకుపడ్డారు. బీజేపీ గుర్తు తామర పువ్వును ఎద్దేవా చేస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ గా మారింది. బీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన ‘కారు’ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యంగ్యాస్త్రాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. “బుద్ధి సరిగ్గా లేని వారే తామర పువ్వు దేవుడి పూజకు పనికిరాదు అని మాట్లాడుతారు. బ్రహ్మ, విష్ణు, లక్ష్మీదేవి, సరస్వతీ దేవి అందరూ తామర పువ్వుతో సంబంధం ఉన్నవారే. నీరు ఎంత పెరిగినా తామర పువ్వు నీటికి అంటకుండా పైనే ఉంటుంది. మా పార్టీ కూడా అలాగే అన్ని సమస్యలనూ అధిగమించి ఉన్నత స్థాయికి ఎదుగుతుంది” అని ఆయన పేర్కొన్నారు. అంతకాకుండా బీఆర్ఎస్ (BRS) గుర్తు కారుపై సెటైర్లు వేశారు. “కారు గుర్తు ఉన్న పార్టీ వాళ్లు తమ పరిస్థితిని తాము చూసుకోవాలి. వాళ్ల కారు ఇప్పటికే రిపేర్‌కు కూడా పనికిరాకుండా షెడ్డులో పడింది. కనీసం సెకండ్ హ్యాండ్లో ఆ కారును కొనడానికి కూడా ఎవరూ సిద్ధంగా లేరు” అని బండి సంజయ్ (Bandi Sanjay)ఎద్దేవా చేశారు.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
