
* సన్నవడ్లకు బోనస్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
* ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ఆకేరు న్యూస్, పాలకుర్తి : రైతు పక్షపాతిగా కాంగ్రెస్ పనిచేస్తోందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలిపారు.
పాలకుర్తి మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిబుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సన్నవడ్లకు రూ. 500 బోనస్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని చెప్పారు. రాష్ట్రంలోని రైతులు రికార్డు స్థాయిలో పంటలను పండిస్తున్నారని.. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగాన్ని బంగారు యుగంగా చేసేందుకు పాటుపడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, సహకార సంఘం అధ్యక్షులు, డైరెక్టర్లు, వ్యవసాయ మరియు రెవెన్యూ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
…………………………………………