* పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి
ఆకేరున్యూస్, పరకాల : కాంగ్రెస్ హయాంలోనే పేదలకు సొంతింటి కలసాకారమవుతోందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. హనుమకొండ భవాని నగర్ లోని 17 వ డివిజన్ పరిధిలోని అర్హులైన 43 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను ఆయన అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పేద ప్రజల సొంతింటి కల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో నెరవేరుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో ప్రలోభాలకు, పైరవీలకి తావు ఉండబోదన్నారు. ప్రభుత్వం సూచించిన నిబంధన మేరకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలని,ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మహిళా సంఘాల ద్వారా రుణాలు అందిస్తున్నామని..దీంతో పేదలకు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందన్నారు. గత ప్రభుత్వ పాలకుల నిర్వాకం వల్ల ధనిక రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
