Army Arms Theft Case
* లోతైన విచారణ కోసం కస్టడీకి నిందితుడు
* సీరియస్గా పరిగణించిన అధికారులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్లో ఆయుధాల చోరీ కేసును అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేసి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మరింత లోతైన విచారణ కోసం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు.
ఈ కేసు ప్రధాన నిందితుడు, ప్రస్తుతం చంచల్గూడ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేష్ అలియాస్ రాజును పోలీసులు తమ కస్టడీకి తీసుకోనున్నారు. ఇప్పటికే దీనిపై న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.
మరిన్ని వివరాల కోసం..
లోతైన విచారణకు సిద్ధమైన ప్రత్యేక బృందాలుమల్లేష్ను కస్టడీలోకి తీసుకున్న అనంతరం, ఆర్మీ ఆయుధాగారం నుంచి అత్యంత రక్షణ కలిగిన ఆయుధాలను ఏ విధంగా దొంగిలించాడనే అంశంతో పాటు, ఈ కుట్ర వెనుక ఉన్న అసలు ఉద్దేశాలపై ప్రత్యేక పోలీసు బృందాలు లోతుగా ప్రశ్నించనున్నాయి. ముఖ్యంగా ఏకే-203 అస్సాల్ట్ రైఫిళ్లు, ఇన్సాస్ తుపాకులు, 9 ఎంఎం పిస్టళ్లు, నైట్ విజన్ బైనాక్యులర్లతో పాటు వేలాది రౌండ్ల మందుగుండు సామగ్రిని చోరీ చేయడం వెనుకగల కారణాలను రాబట్టనున్నారు.
* ఎవరైనా సహకరించారా?
ఈ దొంగతనంలో అతడికి ఆర్మీ లోపల లేదా బయట నుంచి ఎవరైనా సహకరించారా అనే కోణంలోనూ ఆరా తీయనున్నారు. ఆర్మీలో 16 ఏళ్ల పాటు సేవలుందించి క్రమశిక్షణా రాహిత్యం, ఆరోగ్య కారణాలతో ఇటీవలే విధుల నుంచి తొలగించబడిన మల్లేష్, కేవలం కక్షసాధింపుతోనే ఈ పనిచేశాడా లేదా ఆయుధాలను విక్రయించేందుకు యత్నించాడా అనే కోణంలో పోలీసు విభాగాలు విచారిస్తున్నాయి.
* సీన్ రీకన్స్ట్రక్షన్
నిందితుడి సోషల్ మీడియా ఖాతాల పరిశీలనలో పాకిస్తాన్కు చెందిన ఆయుధ వ్యాపారుల ఖాతాలను ఫాలో అవుతున్నట్లు తేలడంతో, ఆ కోణాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. చోరీ చేసిన ఆయుధాలను నాగర్ కర్నూల్ జిల్లాలోని తన స్వగ్రామంలో దాచిపెట్టిన ప్రదేశాలను నిందితుడి సమక్షంలో మళ్లీ సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేసే అవకాశముంది. ఏడు రోజుల కస్టడీ పూర్తయ్యేసరికి ఈ విచారణ ద్వారా ఆయుధాల చోరీ మిస్టరీపై పూర్తి స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
* అసలేం జరిగిందంటే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేష్ 2010లో భారతీయ సైన్యంలో చేరి దాదాపు 16 సంవత్సరాల పాటు వివిధ ప్రాంతాల్లో సేవలు అందించాడు. 2026 జూన్ 30న ఈయన ఉద్యోగ విరమణ పొందాడు. అయితే త్వరితగతిన సైన్యం నుండి పదవీ విరమణ పొందాల్సి రావడం, దానివల్ల ఏర్పడిన తీవ్ర అసంతృప్తి, కోపమే ఈ దొంగతనానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.
తన ప్లాన్ ప్రకారం ఆగస్టు 30, 31 మధ్యరాత్రి సమయంలో దాదాపు 11:00 గంటల ప్రాంతంలో బోల్లారంలోని 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆవరణలోకి మల్లేష్ ప్రవేశించాడు. అక్కడున్న కోట్ గది, మ్యాగజైన్ రూమ్ తాళాలు తొలగించి, ఆధునిక ఆయుధాలు, భారీగా తుపాకీ గుళ్లను దొంగిలించి పరారయ్యాడు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
