
* సోషల్ మీడియాలో వైరల్
* పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
* విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : ఆధునిక టెక్నాలజీని ఉపయోగించికొని ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఫొటోలు మార్ఫింగ్ చేయడం లేనివి ఉన్నట్లుగా సృష్టించడం జరుగుతోంది. కాస్త సాంకేతిక పరిజ్ఞానం ఉంటే చాలు ..కొంత మంది యథేచ్చగా చేస్తున్న పనులు జనాలను గందరగోళంలో పడేస్తున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్ హీరోయిన్లు సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ ల పేర్లు ఓటర్ల లిస్టులో వచ్చి చేరాయి.ఫేక్ ఓటర్ ఐడి లిస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే అధికారులు రూపొందించిన జాబితాలో నిజంగానే వీరి పేర్లు ఉన్నాయా? లేదా ఎవరైనా దురుద్దేశంతో ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారా? అనేది తెలియాల్సి ఉంది. వేరే ఓటర్ల ఎపిక్ నంబర్ తో హీరోయిన్ల ఫోటోలు పెట్టీ ఓటర్ ఐడీ కార్డులు తయారు చేసినట్లు తెలుస్తోంది. ఫేక్ ఓటర్ ఐడీల ప్రచారంపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు సీరియస్ అయ్యారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. ఎక్కడ వీటిని ఫ్యాబ్రికేట్ చేశారు? ఎవరు ప్రచారం చేశారు? అన్న అంశాలపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ చేయడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదయింది.
………………………………………………………