* పామ్ బీచ్ ఎయిర్ పోర్టు సమీపంలో స్నైపర్ హైడవుట్
* విమానం ఎక్కుతుండగా కాల్పులు జరిపేందుకు ఏర్పాట్లు
* చెట్టుపై గూడు లాంటి స్థావరాన్ని నిర్మించుకున్న దుండగుడు
* మరో దారి నుంచి విమానం ఎక్కించిన భద్రతా సిబ్బంది
ఆకేరు న్యూస్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి హత్యా యత్నం జరిగింది. భద్రతా సిబ్బంది అప్పమత్తం కావడం వల్ల ట్రంప్ బయట పడ్డారు. దుండగుడు పగడ్బంధీగా హత్యా యత్నానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. పామ్ బీచ్ విమానాశ్రయానికి 2 వందల గజాల దూరంలో ఓ చెట్టుపై గూడు లాంటి స్థావరాన్ని నిర్మించుకొని దానిపై ట్రంప్ కు తుపాకీ గురిపెట్టే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాడు. భద్రతా దళాల దృష్టికి ఆ చెట్టు పై ఉన్న గూడు కన్పించడంతో అప్పమత్తమైన అధికారుల పామ్ ఆ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకొని ట్రంప్ ని వేరే మార్గం ద్వారా విమానంలోకి ఎక్కించారు.అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పై దుండగుడు కాల్పులు జరపడం, అదృష్టవశాత్తూ చెవికి తగిలిన చిన్న గాయంతో ట్రంప్ తప్పించుకోవడం తెలిసిందే. ఆ తర్వాత కూడా ట్రంప్ పై దాడికి ప్రయత్నం జరిగింది. ట్రంప్ పై దాడి జరగడం ఇది మూడో సారి ఈ ఘటనపై ఎఫ్బీఐ దర్యాప్తు జరుపుతోంది.
………………………………….
