 
                – ఐఎన్ఎస్ విక్రాంత్ ఆత్మ నిర్భర భారత్ కి సంకేతం 
– ఆపరేషన్ సింధూర్లో శత్రుదేశాల వెన్నులో వణుకు 
పుట్టించింది. 
– ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఆకేరు న్యూస్, కమలాపూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీపావళి వేడుకలను ఏటా సైనికులతో జరుపుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం తన 12వ దీపావళి వేడుకలను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుద్ధనౌక పై జరుపుకున్నారు. దీపావళి వేడుకల్లో భాగంగా ఆయన సైనికులకు మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశ గర్వం అని కొనియాడారు. దీని పేరు వినగానే పాకిస్తాన్లో భయం ఆవరించిందనీ,బ్రహ్మోస్ క్షిపణుల పేరు వినగానే కొన్ని దేశాలకు భయం అని, ఈ క్షిపణులను కొనుగోలు చేయడానికి పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి అని ఆయన అన్నారు. ఇక్కడికి రావడం తనకు ఎంతో గర్వంగా ఉందని ఆయన అన్నారు.
పాకిస్తాన్ సీజ్ ఫైర్ కోసం ప్రాధేయపడింది
ఆపరేషన్ సింధూర్ దాడిలో పాకిస్తాన్ నిద్రలేని రాత్రులను గడిపిందని అన్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ ను మోకాళ్లపై కూర్చోబెట్టిందని, మన త్రివిధ దళాలు సమన్వయంతో పని చేయడం వల్ల పాకిస్తాన్ సీజ్ ఫైర్ కోసం ప్రాధేయపడిందని అన్నారు.
…………………………………………….

 
                     
                     
                    