ఆకేరు న్యూస్, ములుగు: ఇటివల ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం బీరెల్లి గ్రామానికి చెందిన మంకిడి పవన్ చెరువులో పడి మృతి చెందారు. ఆయన స్నేహితులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కరకగూడెం మండలం. బట్టుపల్లి( లక్ష్మీపురం) గ్రామానికి చెందిన బండారి వెంకటేశ్వర్లు పవన్ కుటుంబానికి,50.000 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. అంతేకాకుండా, svs, కమిటీ సభ్యులు 15000 వేల రూపాయలు, అందించారు. ఈ సందర్భంగా పవన్ స్నేహితులు ఆయన చిత్రం పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భగత్,గడదాసు ఉమ, రాజు. బీరెల్లి యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
………………………………………………..
