* వేడుకలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
ఆకేరు న్యూస్, హనుమకొండ :పరమశివుడి ఎంతో ప్రీతి పాత్రమైన కార్తీక మాసోత్సవ వేడుకలు ప్రారంభం అయ్యాయి బుధవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి వేయి స్తంభాల దేవాలయంలో జ్యోతి వెలిగించి ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించారు.అంతకుముందు ఎమ్మెల్యే నాయిని దంపతులు రుద్రేశ్వర స్వామి వారికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలను నిర్వహించారు.పూజల అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందించి,ఆశీర్వదించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్తీక మాసం అనేది శైవ భక్తులకే కాదు, ప్రతి హిందువుకూ పవిత్రమైన మాసం అన్నారు పరమశివుని ఆరాధనకు ఈ మాసం ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు. ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగిస్తూ, శివాలయాలకు వచ్చి పూజలు చేయాలని కోరారు. మన సంస్కృతిని, సంప్రదాయాలను మరింత బలంగా నిలబెట్టే కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని నాయిని అన్నారు. ఈ కార్తీక మాసం అందరికీ శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యాన్ని తీసుకురావాలి అని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు,జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ సంపత్,ఆలయ కార్యనిర్వాహక అధికారి అనిల్, ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ,నాయకులు కుమార్ యాదవ్,నాగరాజు తదితరులు ఉన్నారు.
