* పోలీస్ జాగృతి కార్యక్రమాలతో చైతన్యం రావాలి
* వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
పోలీస్ జాగృతి కళా బృందం నిర్వహించే సంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకరావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.వరంగల్ పోలీస్ కమీషనరేట్ పోలీస్ జాగృతి కళా బృందం సభ్యులతో వరంగల్ పోలీస్ కమిషనర్ తన కార్యాలయంలో ముచ్చటించారు. ఈ సందర్బంగా జాగృతి కళా బృందం గ్రామాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఏ ఏ అంశాలపై ప్రజలకు అవగహన కల్పిస్తున్నారు మొదలైన విషయాలను సీపీ కళా బృందం ఇంచార్జి ఏ.ఎస్.ఈ నాగమణి ని అడిగి తెలుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో ప్రజలకు సైబర్ నేరాలు, రోడ్ సేఫ్టీ, మూడ నమ్మకాలు,షీ టీం, డయల్ 100, మత్తు పదార్థాలపై అవగహన కల్పించే రీతిలో గ్రామీణ ప్రజలకు అర్ధమయ్యే రీతిలో కథాంశాలతో ప్రదర్శనలు ఇవ్వాలని. అదే విధంగా కేవలం కథాంశాలే కాకుండా గత మూడు సంత్సరాలు గా సంబంధించి పూర్తి వివరాలను ప్రజలకు వివరించడంతో పాటు జరిగిన నష్టలపై ప్రజలకు వివరించాలని, ముఖ్యంగా కార్యక్రమాల నిర్వహణ కోసం కళా బృందం సభ్యులు ఒక నెల ముందుగానే చక్కటి ప్రణాళికను రూపొందించుకోవడంతో పాటు, సంబంధిత అధికారుల నుండి పూర్తి సమాచారాన్ని సేకరించుకోవాలని బృందం సభ్యులకు తెలపడంతో పాటు, కళా బృందం కార్యాచరణపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిందిగా ఏసీపీ ఎస్. బి 2 జాన్ నర్సింహులుకు సీపీ సూచించారు. సీపీతో ముచ్చటించిన వారిలో హెడ్ కానిస్టేబుళ్ళు విలియమ్, రత్నయ్య, వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ పూల్ సింగ్ తో పాటు హోంగార్డ్స్ పాల్గొన్నారు.
