* కోర్టును ఆశ్రయించిన చిరంజీవి
* కోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైం
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : మెగా స్టార్ చిరంజీవి డీప్ ఫేక్ బారిన పడ్డారు. సమాజంలో ప్రముఖ వ్యక్తులను సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఫేక్ వీడియోలు సృష్టించడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. డబ్బు కోసం ఎంతకైనా తెగించే స్థాయికి దిగజారుతున్నారు. తమకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని విచ్చిలవిడిగా దుర్వినియోగం చేస్తూ జనాల్లో వైరల్ కావడం డబ్బు సంపాదించడం ఇదే మొదటి ప్రాధాన్యతగా మారింది. ఇటీవల వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు సృష్టిస్తుంది. అయితే దీనిని వాడే విధానంలోనే అనేక పెడదోరణులకు దారితీస్తోంది. తాజాగాా మెగా స్టార్ చిరంజీవికి ఈ తలనొప్పి తప్పలేదు. చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం కాస్తా చిరంజీవి దృష్టికి రావడంతో వెంటనే స్పందించిన చిరంజీవి సీపీ సజ్జనార్ కు ఫిర్యాదు చేయడమే కాకుండా కోర్టును ఆశ్రయించారు. కోర్టు వెంటనే సైబర్ క్రైం వారిని ఆదేశించడంతో సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ముఖేష్ అంబానీని వదల్లేదు
సైబర్ రాబరీ గాళ్లు గతంలో ప్రముఖ బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీని వదల్లేదు. డిజైన్ చేసిన సెలబ్రిటీల వీడియోల్ని ఫైనాన్షియల్ ఫ్రాడ్స్‌కు ఉపయోగించడం మోసగాళ్లు పాల్పడుతున్న కొత్త ట్రెండ్. డీప్‌ఫేక్ వీడియోలు ఇప్పుడు రాబరీగాళ్లకు చిక్కిన సరికొత్త వెపన్స్. ముఖేష్ అంబానీ పేరిట ప్రచారంలో ఉన్న ఒక బిజినెస్ అడ్వైజ్‌ని నమ్మి.. రూ. ఏడు లక్షలు పోగొట్టుకున్నాడు ముంబైకి చెందిన ఓ డాక్టర్. ముఖేష్ అంబానీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇస్తే నమ్మకుండా ఎలా ఉంటారు. అందుకే, 16 బ్యాంకు అకౌంట్లలోకి పదేపది రోజుల్లో ఏడు లక్షల 10 వేలు డిపాజిట్ చేశాడు. తర్వాత ట్రేడింగ్ వెబ్సైట్ నుంచి ప్రాఫిట్‌ని విత్‌డ్రా చేసుకోబోతే.. అంతా మోసం అని తేలిపోయింది.ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవన్, జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేసాయ్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ సుధా మూర్తి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కూడా ఈ కేటుగాళ్లు వదల్లేదు.ఇన్ఫోసిస్ ఛైర్పర్సన్ సుధామూర్తి ఒక ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రమోట్ చేస్తున్నట్టు ఫేక్‌వీడియో ప్రచారంలోకొచ్చింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిందని నమ్మి, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్‌లో రూ. 20 లక్షలు పోగొట్టుకున్నాడు హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్. ఇక అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్,సల్మాన్ ఖాన్ లాంటి స్టార్లపై ఎన్ని రకాల అశ్లీల వీడియోలు వస్తున్నాయే చూస్తూనే ఉన్నాం. కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వల్ల ఎంత లాభం ఉందో సమాజానికి అంతే నష్టం ఉంది. ఏ ఐ దుర్వినియోగం కాకుండా ఉండేందుకు కొత్త చట్టాన్ని తెచ్చే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.
…………………………………………………….
