* తీరం దాటనున్న మొంథా తుఫాను
* ఆ సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు
* కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం అత్యవసర సమీక్ష
* ఉప ముఖ్యంత్రి పవన్ తో కలిసి తుఫానుపై ఆరా
ఆకేరు న్యూస్, డెస్క్ : మొంథా తుఫాను నేపథ్యంలో ఏపీ, యానాం, దక్షిణ ఒడిశాకు రెడ్ అలర్ట్ జారీ అయ్యాయి. క్రమంగా ఏపీ తీరం వైపు మొంథా తుఫాను కదులుతోంది. గడిచిన 6 గంటల్లో 15 కిలోమీటర్ల వేగంతో మొంథా తుఫాను ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. పశ్చిమ తీరం నుంచి బంగాళాఖాతంలోకి తుఫాను చేరనుంది. మరికొద్ది గంటల్లోనే తీవ్ర తుఫానుగా బలపడనుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తీవ్ర తుఫానుగానే తీరంగా మొంథా తీరం దాటనుందని అధికారిక వర్గాలు తెలియజేస్తున్నాయి. సాయంత్రం లేదా రాత్రికి తీరం దాటే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటలకు ఏకంగా 120 కిలోమీటర్ల వేగంతో ఈదారుగాలులు ఉంటాయని పేర్కొంటున్నారు. మచిలీపట్నానికి 190 కిలోమీటర్లు, కాకినాడకు 270 కిలోమీటర్లు, విశాఖకు 340 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం కేంద్రీకృతమై ఉంది.
సీఎం చంద్రబాబు సమీక్ష
మొంథా తుఫానుపై సీఎం చంద్రబాబు తాజాగా సమీక్ష నిర్వహించారు. కూటమి ఎంపీలు, మంత్రులతో ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ప్రతీ క్షణం అలర్ట్ గా ఉంటూ అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలకు చెందిన నేతలంతా ప్రజలకు అందుబాటులో అండగా ఉండాలని తెలిపారు. అవసరమైతే కేంద్ర సహకారం కోరతామని, ప్రాణ నష్టం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సంక్షోభ సమయంలో ప్రజలకు అండగా ఉండాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఏపీ సచివాలయానికి చేరుకున్నారు. చంద్రబాబుతో కలిసి తుఫాన్‌పై సమీక్షించారు.
…………………………………………..
