* పంట , ఆస్తి, పశు నష్టం జరిగింది
* కేంద్రం తక్షణ సహాయం ప్రకటించాలి
* మంత్రి పొన్నం ప్రభాకర్
ఆకేరు న్యూస్ హుస్నాబాద్ : మొంథా తుఫాన్ వల్ల పడ్డ అకాల వర్షాలకు భారీ గా నష్టం వాటిల్లిందని రవాణా ,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.గత 40 ఏళ్లలో ఇలాంటి వర్షం ఎప్పుడూ పడలేదని అన్నారు. గురువారం ఆయన హుస్నాబాద్ మార్కెట్ యార్డును సందర్శించారు. వరద నీటికి తడిసి ధాన్యాన్ని మంత్రి పరిశీలించారు. ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. వందలాది మెట్రిక్ టన్నుల ధాన్యం కొట్టుకుపోగా..వేలాది మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయిందని మంత్రి అన్నారు, మార్కెట్ లో ఉన్న మొక్కజొన్నను కొనుగోలు చేయాలని మంత్రి మార్క్ఫెడ్ అధికారులను ఆదేశించారు
……………………………………………….
