* మంత్రి కొండా సురేఖపై ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఫైర్
* మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్
ఆకేరు న్యూస్, వరంగల్ : మంత్రి కొండా సురేఖ మంత్రిపదవికి రాజీనామా చేయాలని ఎర్రబెల్లి ప్రదీప్ రావు డిమాండ్ చేశారు .నేడు ఓ సిటీ లోని ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారి క్యాంప్ కార్యాలయం ప్రదీప్ రావు మీడియాతో మాట్లాడారు. తూర్పు వరంగల్ లోని మైసయ్య నగర్, బీఆర్ నగర్, ఎన్ఎన్ నగర్, శివ నగర్, పెరుక వాడ, సంతోషిమాత కాలనీ, ఎస్సార్ సహా పలు కాలనీలు నీట మునిగినా అటు వైపు కన్నెత్తి చూడలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా తూర్పు వైపు కన్నెత్తి చూడలేదన్నారు. మంత్రి కొండా సురేఖ బాధితులను పరామర్శించకుండా ముఖ్యమంత్రి పక్కన ఫొటోలకు ఫోజులిచ్చారని విమర్శించారు. ఒక్క ఎకరాకు 50 వేల పెట్టుబడి పెట్టిన రైతుకు రూ . పది వేలు నష్టపరిహారం ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.రైతులకు తక్షణమే ఎకరానికి 50 వేల రూపాయలు ఇవ్వాలన్నారు.నగరంలో వరద ముంపునకు గురైన ప్రజలకు తక్షణమే 25 వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ సీతారాం నాయక్ , మాజీ శాసనసభ్యులు శ్రీ వన్నాల శ్రీరాములు , శ్రీ ఆరూరి రమేష్, శ్రీ కొండేటి శ్రీధర్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ కుసుమ సతీష్ , శ్రీ వన్నాల వెంకటరమణ గారు, బిజెపి సీనియర్ నాయకులు సముద్రాల పరమేశ్వర్ గారు తదితర మండల అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు మోర్చాల అధ్యక్షులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
…………………………………………………..
