* బీబీ నగర్ వద్ద ఘటన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : స్పీడ్ గా వస్తున్న వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి పక్కనే ఉన్న ఇద్దరిపై దూసుకెళ్లగా ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ వద్ద జరిగింది. బీబీ నగర్ హైవేపై స్పీడ్ గా వస్తున్న వాహనం అదుపుతప్పి డీవైడర్ ను ఢీ కొని రోడ్డ పక్కన నిలుచున్న ఇద్దరు యువతీ యువకులపై దూసుకెళ్లగా యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, యువతి ఎగిరి చెరువులో పడి మృతి చెందింది, వాహనంలో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
……………………………………..
