* ఫర్నిచర్ కు నిప్పు
* మణుగూరు లో ఉద్రిక్తత
ఆకేరు న్యూస్, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక బీఆర్ ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగారు. ఫర్నిచర్ కు నిప్పుపెట్టారు. ఫ్లెక్సీలను తగలబెట్టారు. బీఆర్ఎస్ కార్యాలయన్ని ఆక్రమించి కాంగ్రెస్ రంగులు వేస్తున్నారు. దాడికి ముందే కాంగ్రెస్ రంగులు, స్టిక్కర్లు, ఫ్లెక్సీలు ముద్రించి తమవెంట తెచ్చుకున్నారు. పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. ప్రభుత్వ స్థలంలో బీఆర్ ఎస్ కార్యాలయాన్నికట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. గొడవ గురించి పోలీసులకు సమాచారం అందడంతో బీఆర్ ఎస్ కార్యాలయం వద్దకు చేరుకొని పరిస్థిని శాంతింపజేశారు.

…………………………….
