ఆకేరు న్యూస్ డెస్క్ : మహిళల వన్డే ప్రపంచకప్ టైటిల్ సాధించిన నాలుగో జట్టుగా భారత్ అవతరించింది. ఆదివారం ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి ఈ ఫీట్ సాధించింది. 1973లో ప్రారంభమైన మహిళా వరల్డ్ కప్ పోటీల్లో ఆస్ట్రేలియా 7 సార్లు టైటిల్ సాధించగా ఇంగ్లండ్ నాలుగు సార్లు న్యూజిలాండ్ ఒక్కసారి టైటిల్ చేజిక్కుంచుకుంది. తాజా వరల్డ్ కప్ విజేతల జాబితాలో భారత్ చేరింది
1973 నుంచి 2025 వరకు విజేతలు..
1973 – ఇంగ్లాండ్ (రన్నరప్: ఆస్ట్రేలియా) ,1978 – ఆస్ట్రేలియా (రన్నరప్: ఇంగ్లాండ్),1982 – ఆస్ట్రేలియా (రన్నరప్: ఇంగ్లాండ్),1988 – ఆస్ట్రేలియా (రన్నరప్: ఇంగ్లాండ్),1993 – ఇంగ్లాండ్ (రన్నరప్: న్యూజిలాండ్)
1997 – ఆస్ట్రేలియా (రన్నరప్: న్యూజిలాండ్),2000 – న్యూజిలాండ్ (రన్నరప్: ఆస్ట్రేలియా)
2005 – ఆస్ట్రేలియా (రన్నరప్: భారత్),2009 – ఇంగ్లాండ్ (రన్నరప్: న్యూజిలాండ్),2013 – ఆస్ట్రేలియా (రన్నరప్: వెస్టిండీస్),2017 – ఇంగ్లాండ్ (రన్నరప్: భారత్),2022 – ఆస్ట్రేలియా (రన్నరప్: ఇంగ్లాండ్)
2025 – భారత్ (రన్నరప్: దక్షిణాఫ్రికా)
………………………………….
