* మరో ఆరు నెలలు కాల్పుల విరమణ
* అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల
* శాంతిని భంగం చేసేందుకు కేంద్రం కుట్రలు
ఆకేరు న్యూస్, హైదరబాద్ : మావోలు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో ఆరు నెలలు కాల్పుల విరమణ పాటిస్తామని ప్రకటించారు. ఈ మేరకు మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేశారు. శాంతియుత వాతారణం నెలకొనేందుకు ప్రజలు.. ప్రజా సంఘాల నాయకులు.. పలు పార్టీల నాయకులు స్వచ్ఛందంగా ఉద్యమాలు చేశారని లేఖలో తెలిపారు. ప్రజల ఆకాంక్ష మేరకు గత మే నెలలో ఆరు నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటించిన విషయాన్ని ప్రస్థావించారు. ప్రజలు శాంతియుత వాతారణమే కోరుకుంటున్నారని.. వారి ఆకాంక్ష మేరకు మరో ఆరు నెలలు కొనసాగిస్తామని ప్రకటించారు.
శాంతిని భంగం చేసేందుకే కేంద్రం కుట్రలు..
దేశం, రాష్ట్రంలో నెలకొన్న శాంతియుత వాతావరణాన్ని భంగం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని జగన్ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. కేంద్రం అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేఖంగా ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు సంఘటితంగా పోరాడాలని మావోయిస్టు పార్టీ కోరింది. రాష్ట్రంలో శాంతియుత వాతారణం నెలకొనేందుకు తాము సహకరిస్తున్నామని.. కేంద్ర ప్రభుత్వం సైతం ఇందుకు సహకరించాలని కోరుతున్నామన్నారు. ఆరు నెలలుగా తమ వైపు నుంచి శాంతియుత వాతావరణం కొనసాగేలా వ్యవహరించామన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు మరో ఆరు నెలలు కాల్పుల విరమణ పొడిగించామని తెలిపారు.

……………………………………………..
