* గుండెలవిసేలా ఏడుస్తున్న ఇద్దరు కూతుళ్లు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : చేవెళ్ల వద్ద మీర్జాగూడలో జరిగిన బస్సు ప్రమాదం బాధితుల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఓ కుటుంబలో బీటెక్ చదువుతున్న ముగ్గరు కూతుళ్లను ఓ కుటుంబం పోగొట్టుకుంటే.. తల్లిదండ్రులను పోగొట్టుకొన్న ఇద్దరు చిన్నారులు గుండెలవిసేలా ఏడుస్తున్న తీరుకు అక్కడున్న వారిని కలచి వేస్తోంది. అమ్మానాన్నలు విగతజీవులుగా పడి ఉండడాన్ని ఆ ఇద్దరు పిల్లలు తట్టుకోలేక పోతున్నారు. వారిద్దరినీ ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం హాజీపూర్‌కు చెందిన భార్యాభర్తలు బందప్ప, లక్ష్మీ మృతి చెందారు. వారి పిల్లలు భవానీ, శివలీల ప్రాణాలతో బయటపడ్డారు. అమ్మానాన్న తిరిగి రారు అని తెలుసుకొని ఏడుస్తున్నారు. అమ్మానాన్నలను పోగొట్టుకొని ఇప్పుడు అనాథలుగా మిగిలారు.
……………………………………………
