* మీర్జాగూడ ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు విద్యార్థినులు
ఆకేరు న్యూస్. హైదరాబాద్ : హైదరాబాద్ చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు బీఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతున్న సాయిప్రియ, బీకాం ఫస్టియర్ చదువుతున్న ఈ.నందని, ఎంపీసీఈఎస్ తృతీయ సంవత్సరం చదువుతున్న ముస్కాన్లు మృతి చెందారు . ఈ ముగ్గురు విద్యార్థినుల మృతి చెందడం కళాశాల విద్యార్థినులను కలచి వేసింది. మిగతా విద్యార్థినులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విద్యార్థినుల మృతి సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లోకపావని సంతాప సమావేశం నిర్వహించి విద్యార్థినుల మృతికి సందర్భంగా వారి ఆత్మలకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.
………………………………………………………….
