* వరుస ఆక్సిడెంట్లతో హడలి పోతున్న జనం
ఆకేరు న్యూస్ : రంగా రెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి ఇంకా కోలుకోక ముందే హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ జాతీయ రహదారిపై మరో ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి మెట్ పల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు రేణుకుంట బ్రిడ్జి వద్దకు చేరుకోగానే ముందుగా వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీ కొట్టింది.డ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనక నుంచి బస్సు ఢీ కొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డైవర్తో పాటు బస్సులో ఉన్న 15 మందికి ప్రయాణికులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని బస్సులోని ప్రయాణికులను బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాదు నుంచి మెట్టుపల్లికి వెళ్తుండగా రేణికుంట బ్రిడ్జి వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.ప్రమాద సమయంలో బస్సు 50 స్పీడ్తో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వేగం తక్కువగా ఉండటం వల్లే ప్రమాద తీవ్రత తక్కువ ఉందని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులు ఉన్నారని పేర్కొన్నారు. బస్సులో అందరూ నిద్రపోతూ ఉండటం వల్ల.. బస్సు అద్దాలు గుచ్చుకున్నాయని పోలీసులు వెల్లడించారు. కర్నూల్ల జిల్లాలో జరిగిన ప్రమాదం ఇంకా పూర్తిగా మర్చిపోక ముందే మీర్జాగూడ ఘటన జరిగింది. అంతకు మందు యాదాద్రి భువనగిరి జిల్లా బిబి నగర్ వద్ద ఓ వాహనం పాద చారుల పైకి దూసుకెళ్లగా ఇద్దరు మృతి చెందారు. రోడ్డుపై మాట్లాడుకుంటూ ఉన్న యువతీ యువకుల్లో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా యువతి పక్కనే ఉన్న చెరువులో ఎగిరి పడి మృతి చెందింది. ఓ వైపు మీర్జాగూడ వార్తలను టీవీలో చూస్తున్న క్రమంలోనే రాజస్థాన్ రాష్ట్రంలో ఘోన ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన ట్రక్కు 17 పైగా వాహనాలపైకి దూసుకెళ్లగా 14 మంది మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై ఓ గ్రానైట్ లారీ తొర్రూరు సమీపంలో అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లగా లక్ష్మి అనే మహిళ తీవ్రంగా గాయపడింది.
అతివేగం వల్లే ప్రమాదాలు
రాష్ట్రంలో కాని దేశ వ్యాప్తంగా కాని ప్రతీ రోజూ ఏదో ఓ చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలకు కారణం అతి వేగం అనే తెలుస్తోంది, 84 శాతం అతి వేగం కారణం కాగా, 4 శాతం రాంగ్ సైడ్ డ్రైవింగ్ అని తెలుస్తోంది. ఇక మధ్యం తాగి డ్రైవింగ్ చేసి ప్రమాదం జరిగిన సంఘటనలు 2 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతీ ఏటా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి పరిశీలిస్తే 2020 నుంచి పరిగణలోకి తీసుకుంటే ప్రమాదాల సంఖ్య ఏ విధంగా ఉందో ఓ సారి పరిశీలిద్దాం.. 2020లో రాష్ట్రంలో 19 వేల 172 రోడ్డ ప్రమాదాలు జరుగగా అందులో 6, 882 మంది మరణించారు.18 వేల 661 మంది క్షతగాత్రులయ్యారు. 2021లో 21 వేల 315 రోడ్డు ప్రమాదాలు జరుగగా 7 వేల 559 మరణించగా 20 వేల 203 మంది గాయపడ్డారు. 2022లో 21 వేల 619 ప్రమాదాలు జరుగగా 7 వేల 558 మంది మరణించారు 20 వేల మంది గాయపడ్డారు. 2023 లో 22 వేల 903 ప్రమాదాలు జరుగగా 7 వేల 660 మంది చనిపోయారు.20 వేల 924 మంది గాయపడ్డారు. 2024లో 25 వేల 926 ప్రమాదాలు జరుగగా 7 వల 9 49 మంది మృతి చెందారు 23 వేల 658 మంది గాయపడ్డారు. ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటి వరకు 16 వేల 7 ప్రమాదాలు జరుగగా 4 వేల 625 మంది చనిపోయారు. 13 వేల 756 మంది గాయపడ్డారు.
……………………………………………
