* కల్తీ ఆహారం పెడుతున్నారని విద్యార్థుల ఆందోళన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాణ్యత లేకుండా కల్తీ ఆహారం పెడుతున్నారంటూ గోదావరి హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కల్తీ ఆహారం వల్ల అనారోగ్యానికి గురిఅవుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ ఆహారం ఎందుకు పెడుతున్నారని కాంట్రాక్టర్ ను నిలదీస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని మండి పడ్డారు.హాస్టల్ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళన నేపధ్యంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో భారీగా పోలీసులను మోహరించారు.
……………………………………………………………..
