ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్ర మంత్రిగా అక్టోబర్ 31న ప్రమాణ స్వీకారం చేసిన మహ్మద్
అజహరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. మైనార్టీల సంక్షేమం,పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్
శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అజహరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఆయనకు హోం శాఖ కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. గతంలో బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో హోం మంత్రిగా మహమూద్ అలీ కొనసాగారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీ వర్గానికే హోం శాఖ కేటాయిస్తారనే అందరూ అనుకున్నారు. మొత్తానికి అజహర్ మంత్రిత్వ శాఖలపై వచ్చిన ఊహాగానాలకు తెరపడింది.
……………………………………….
