* ఒకదానికొకటి ఢీకొన్నకార్లు
ఆకేరు న్యూస్, డెస్క్ : ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో మరోసారి అపశృతి చోటుచేసుకుంది.
మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన బాదితులను జగన్ పరామర్శిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపధ్యంలో ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద కాన్వాయ్ వాహనాలు ఒక దాని కొకటి ఢీకొన్నాయి. దీంతో పలువురికి గాయాలు అయ్యాయి. వాహనాలు ఢీ కొనడంతో చాలా సేపటి వరకు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. పైగా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున జగన్ ను చూసేందుకు రోడ్లపైకి వస్తూండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది.వైసీపీ నేతల అత్యుత్సాహం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.గతంలో కూడా ఇలాంటి వివాదాలు చోటుచేసుకున్నాయి. సత్తెనపల్లి పర్యటనలో వెంగళాయపాళెం గ్రామానికి చెందిన 50 ఏళ్ల చీలి సింగయ్య జగన్ కారు కిందపడి ప్రాణాలు విడిచారు. అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటనలో కూడా వివాదం చోటుచేసుకుంది. జగన్ హెలికాఫ్టర్లో అక్కడికి చేరుకున్నారు. ఆయన చూడడానికి వందలాది వైసీపీ కార్యకర్తలు హెలికాఫ్టర్ వద్దకు దూసుకొచ్చారు. జనాలను పోలీసు సిబ్బంది నియంత్రించలేక పోయ్యారు. దీంతో జనం తాకిడితో హెలికాఫ్టర్ విండ్ షీల్డ్(అద్దాలు) ధ్వంసమైయ్యాయి.
…………………………………………..
