* ప్రజలు బాధల్లో ఉంటే లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్లారు
* మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి
* మొంథా తుఫాన్ బాధితులకు పరామర్శ
ఆకేరు న్యూస్ , డెస్క్ : రైతుల విషయంలో సీఎం చంద్రబాబు మైండ్ సెట్ మారాలని ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మొంథా తుఫాన్ కు గురైన పెనమలూరు,పెడన,పామర్రు,మచిలీపట్నం ప్రాంతాల్లో పర్యటించారు. ఏపీలో ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానాలు వస్తున్నాయన్నారు. ఓ వైపు మొంథాతుఫాన్ తో ప్రజలు బాధ పడుతుంటే సీఎం కొడుకు మంత్రి లోకేష్ బొంబాయిలో క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్లారని విమర్శించారు.ప్రభుత్వం ఇంత వరకూ పంట నష్టం అంచానా వేయకపోవడం విచారకరమన్నారు. తమ ప్రభుత్వ హయాంలో కలెక్టర్లకు బాధ్యతలు అప్పజెప్పేవారమని అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కష్టకాలంలో కూడా ప్రభుత్వంరైతులను ఆదుకోలేని దుస్థితిలో ఉందన్నారు.మొంథా తుఫాన్ వల్ల భారీగా పంట నష్టం జరిగిందన్నారు. లక్షల ఎకరాల్లో పత్తి మొక్కజొన్న, అరటి, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.18 నెలల కూటమి పాలనలో 16 సార్లు ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయని అన్నారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులను మోసం చేస్తున్నారని జగన్ విమర్శించారు. బాధితులనుపరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
………………………………………………
