* ఎదురెదురుగా ఢీ కొన్న రైళ్లు
* ఆరుగురు మృతి, పలువురికి గాయాలు
ఆకేరు న్యూస్ డెస్క్ : చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది, జైరాం నగర్ స్టేషన్ సమీపంలో ఖిలాస్పూర్ వద్ద రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఆగి ఉన్న గూడ్స్ రైలును కోర్బా ప్యాసింజర్ రైలు ఢీ కొనడంతో రైలులో కూర్చున్న ప్రయాణికుల్లో ఆరుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
……………………………………………….
