* డ్రగ్స్.. గన్ కల్చర్..
* మంత్రి తుమ్మల హాట్ కామెట్స్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన.. బీఆర్ ఎస్ నాయకులే డ్రగ్స్.. గన్ కల్చర్‌ను ప్రోత్సహించారని మంత్రి తుమ్మల కామెట్స్ చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్‌కు మూలం కేటీఆరే అన్నారు. అప్పులు చేసిన దివాళా తీసిన రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని తుమ్మల చెప్పారు. జూబ్లీహిల్స్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందులున్నా.. అభివృద్ధిని సాగిస్తున్నామన్నారు. అసెంబ్లీ.. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్, కేటీఆర్‌కు ప్రజలు బుద్ది చెప్పారని..ఆ సంగతి కేటీఆర్ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు సీఎం రేవంత్ ఇబ్బందులు పెడుతున్నారని కేటీఆర్ మాటలకు కౌంటర్ ఇచ్చారు. పారిశ్రామికవేత్తలు తెలంగాణాలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు. బీఆర్ ఎస్ ఇచ్చిన వాగ్ధానాలను కేటీఆర్ మరో జన్మ ఎత్తినా నెరవేర్చలేడని ఎద్దేవా చేశారు.
………………………………………….
