బీజేపీ ఎంపీ బండి సంజయ్
* కేంద్ర మంత్రి బండి సంజయ్
* తెలంగాణ పోలీసులకు వార్నింగ్
* ఎవరు అడ్డు వస్తారో చూస్తా..
* ఆరు నూరైనా.. బోరబండ సమావేశం ఆగదు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీజేపీ దమ్మేందో ప్రభుత్వానికి చూపిస్తామని కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం బోరబండలో సమావేశం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ రానుండడంతో పార్టీ పోలీసుల అనుమతి తీసుకొని ఏర్పాట్లు చేస్తోంది. ఇంతలోనే.. బండి సంజయ్ సమావేశానికి అనుమతి నిరాకరించారు. విషయం తెలుసుకున్న ఎంపీ బండి పోలీసులు, ప్రభుత్వంపై మండిపడ్డారు. పోలీసుల తీరు సరికాదని.. వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. బీజేపీ శ్రేణులు బోరబండ సమావేశానికి రావాలని ఆయన పిలుపునచ్చారు. ఆరు నూరైనా సమావేశం పెట్టి చూపిస్తామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపపోరు.. ఎటు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.
…………………………………………
