* ఐఎన్ఎస్ ఇక్షక్ జలప్రవేశం
ఆకేరు న్యూస్, డెస్క్ : దేశ రక్షణలో మరో సరికొత్త అధ్యాయం మొదలైంది. కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్ లో ఐఎన్ఎస్ ఇక్షక్ జలప్రవేశం చేసింది. ఇక్షక్ నౌకను గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్ సంస్థ నిర్మించింది. 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో ఈ నౌకా నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమానికి చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి హాజరయ్యారు. భారత నౌకాదళానికి సాగర దిక్సూచిగా ఇక్షక్ నిలవనుందని నేవీ అధికారులు పేర్కొంటున్నారు. ఐఎన్ ఎస్ ఇక్షక్ ద్వారా సముద్ర సర్వే వ్యవస్థలో కీలక ముందడుగు పడినట్లుగా అభివర్ణిస్తున్నారు. ఇండియన్ షిప్ బిల్డింగ్ లోనే మరో మైలురాయిగా త్రిపాఠి పేర్కొన్నారు. ఈ నౌకలు 3,400 టన్నుల (3,346 పొడవైన టన్నులు) స్థానభ్రంశం, 110 మీటర్లు (360 అడుగులు 11 అంగుళాలు) పొడవు కలిగి ఉంటాయి. భారత నౌకాదళ చరిత్రలో మహిళల కోసం ప్రత్యేక కంపార్ట్ మెంట్ ఇందులో నిర్మించారు. ఇప్పటి వరకు ప్రతీ యుద్ధ నైకలో మహిళ, పురుష సిబ్బందికి పక్కపక్కనే గదులు ఉండేవి. ఇక్షక్ లో ఇప్పుడు వారి కోసం ప్రత్యేక కంపార్ట్ మెంట్ రూపొందించారు. కాగా ఇక్షక్ అంటే గౌడ్ లేదా దిక్కూచి అని అర్థం.
…………………………………………………….
