* జిల్లా కలెక్టర్ దివాకర
ఆకేరు న్యూస్, ములుగు: ఖరీఫ్ సీజన్ లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో విక్రయించి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర సూచించారు. గురువారం వెంకటాపూర్ మండలములోని లక్ష్మీదేవిపేట గ్రామం లో ఇందిరా క్రాంతి పథం ఆధ్వర్యంలో మహిళా సంఘాలు నడుపుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు నాణ్యత ప్రమాణాల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని, దళారులు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయవద్దని, ఎప్పటికప్పుడు ట్యాబ్ నందు రైతుల వివరాలు నమోదు చేసి మద్దతు ధర బోనస్ ఎప్పటికప్పుడు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని, జాప్యం చేసినచో తక్షణమే చర్య తీసుకోకపోవడం జరుగుతోందని సంబంధిత సంఘాల నిర్వాహకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్ పౌరసరఫరాలు బి.రాంపతి, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్
ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
……………………………………….
