ఆకేరు న్యూస్, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల కళాశాల విద్యార్థులు క్రీడల్లో జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఎస్టీఎఫ్- 69 వ క్రీడల్లో అండర్-19 హైదరాబాదులోని జింఖానా స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో హై జంప్ లో మన్విత్ కుమార్ మొదటి స్థానం సాధించి గోల్డ్ మెడల్ అందుకోగా, ట్రిపుల్ జంప్ లో ఎం.మాన్విత్ మూడవ స్థానాన్ని సాధించి కాంస్య పతకం అందుకున్నారు. వీరు ఈనెల 26 నుంచి పంజాబ్ రాష్ట్రంలో జరగనున్న జాతీయస్థాయి పోటీలలో పాల్గొననున్నారు. కాగా విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల ప్రిన్సిపల్ పి. కవిత రెడ్డి, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. ఫిజికల్ డైరెక్టర్ పాక వెంకటేష్ ను అభినందించారు.జాతీయస్థాయిలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరచాలని వారు ఆకాంక్షించారు.
………………………………..
