* సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఆకేరు న్యూస్, డెస్క్ : పబ్లిక్ ప్రదేశాలు, విద్యాసంస్థలు,బస్ స్టేషన్లు,రైల్వే స్టేషన్లు, క్రీడా మైదానాలు, ఆలయాలు,ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రుల, పార్కులు మొదలనై ప్రదేశాల్లో వీధి కుక్కలు కన్పించకుండా చర్యలు తీసుకోవాలని శుక్రవారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. వీధి కుక్కలు ఎక్కడ ఉన్నా షెల్టర్లకు తరలించాలని సూచించింది. న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్.వి. అంజరియాలతో కూడిన ధర్మాసనం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు వాటిని పట్టుకున్న తర్వాత తిరిగి అదే ప్రదేశాల్లో వదలకూడదని స్పష్టం చేసింది.అంతేకాదు, క్రమం తప్పకుండా ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేయాలని స్పష్టం చేసింది.అలాగే.. రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు పునరుద్ఘాటించింది. అన్ని రాష్ట్రాల నోడల్ అధికారులకు జాతీయ రహదారులు, హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు మీద కనిపించే నిరాశ్రయ జంతువులను తొలగించాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ఈ కార్యక్రమం కోసం జాయింట్ కోఆర్డినేటెడ్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించింది. రహదారుల నుంచి తరలించిన పశువులు, కుక్కలకు అవసరమైన సంరక్షణాన్ని అందించాలని తెలిపింది. రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు ఆదేశాల అమలుపై కచ్చితమైన బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే సంబంధిత అధికారులపై వ్యక్తిగత చర్యలు తీసుకోబడుతాయని సుప్రీంకోర్టు హెచ్చరించింది. 8 వారాల్లోగా అమలు విధానం, చర్యలపై స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది.ను ఇంప్లీడ్ చేయడంతో పాటు, కుక్కల దాడులకు గురైన బాధితుల దరఖాస్తులకు అనుమతి ఇచ్చింది.
