* రిమాండుకు తరలించిన పోలీసులు
* ఏ -1 గా బస్సు డ్రైవర్ లక్ష్మయ్య
ఆకేరు న్యూస్, కర్నూల్ : కావేరి ట్రావెల్స్ యజమాని వేమూరి వినోదును పోలీసులు అరెస్టు చేశారు. కర్నూల్ బస్సు సంఘటన పై వి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్, ఓనర్ ల పై కేసు నమోదు చేశారు. అక్టోబర్ 24 తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కర్నూలు జిల్లా, ఉలిందకొండ పియస్ పరిదిలోని కల్లూరు మండలం, చెట్లమల్లాపురం గ్రామ పరిధిలో 44 వ జాతీయ రహదారి పై వి కావేరీ ట్రావెల్ బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. పత్తికొండ డిఎస్పీ వెంకట రామయ్య కేసును దర్యాప్తు చేశారు. ప్రమాదానికి కారకుడిగా బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యను అక్టోబర్ 28న పోలీసులు అరెస్టు చేసి.. కోర్టులో హాజరు పరిచారు. అనంతరం రెండవ ముద్దాయి వి కావేరీ ట్రావెల్స్ బస్సు ఓనర్ వేమూరి వినోద్ కుమార్ నూ కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. సీటర్ వాహనాన్ని.. స్వీపర్‌గా మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. బస్సు రిజిష్ట్రేషన్లోనూ లొసులున్నట్లు గుర్తించారు.
