* భర్తతో గొడవ పడి బిడ్డను ట్రాక్టర్ టైర్ల కింద విసిరేసిన తల్లి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కన్న బిడ్డలకు చిన్న దెబ్బ తాకితేనే విలవిలలాడే తల్లులను చూశాం కానీ ఓ మహాతల్లి భర్త డబ్బులు ఇవ్వలేదని రెండు నెలల చిన్నారిని ట్రాక్టర్ టైర్ల కిందకి విసిరేసింది. టైర్లకిందకి చిన్నారిని విసిరేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే ఈ అమానుష అమానవీయ ఘటన మెదక్ జిల్లాలో జరిగింది.వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లికి చెందిన సంధ్య- స్వామి భార్యాభర్తలు. భర్త కొంత కాలం గ్రామపంచాయతీ పరిధిలో చెత్త సేకరించే పనికి వెళ్లాడు. భర్త పని తాలూకూ డబ్బులు తనకే ఇవ్వాలని భర్త స్వామికి ఇవ్వకూడదని సిబ్బంద కి షరతు విధించింది. ఇందుకు నిరాకరించిన సిబ్బంది డబ్బులు తమకు సంబంధం లేదని గ్రామ పంచాయతీ నుంచి డబ్బులు ఇస్తారని తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన సంధ్య.. తన రెండు నెలల చిన్నారిని అక్కడే ఉన్న చెత్త సేకరించే ట్రాక్టర్ టైర్ల కిందకు విసిరేసింది. ఇది గమనించిన స్థానికులు చిన్నారిని రక్షించారు. అలాగే శిశు సంరక్షణ కేంద్రం, అంగన్వాడీ సిబ్బందికి సమాచారం అందించారు.
…………………………………………………….
