* డాక్టర్ ఉమర్ ప్రధాన సూత్రధారిగా అనుమానం
* కారులో అతడూ ఉన్నట్లుగా దర్యాప్తు
* నిందితుడి డీఎన్ఏ పరిశీలన
* ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు
* కీలక ఆధారాలు సేకరించిన అధికారులు
* ఆత్మాహుతి కోణంలోనూ దర్యాప్తు
* ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్
ఆకేరు న్యూస్, డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తు ను అధికారులు ముమ్మరం చేశారు. ఢిల్లీ బ్లాస్ట్ కు ఫరీదాబాద్, పుల్వామాకు లింకులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అంతేకాదు.. అది ఆత్మాహుతి దాడిగా నిర్ధారించారు. కారు పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్గా నిర్ధారించారు. పేలుళ్లకు ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తూ డాక్టర్ ఉమర్ మొహమ్మద్ ఫొటోను దర్యాప్తు సంస్థలు తొలిసారిగా విడుదల చేశాయి. నిందితుడి డీఎన్ ఏ ను సేకరించారు.
13 మంది దుర్మరణం..
ఢిల్లీ కారు పేలుడులో మొత్తంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు జరిగిన తీరు, గాయపడిన వారి శరీరాలపై పెల్లెట్ల ఆనవాళ్లు లేకపోవడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. ఇది ఆత్మాహుతి దాడి గా నిర్ధారించారు. ఇప్పటికే అనుమానుతులను అరెస్టులు జరుగుతున్నాయి. జమ్ముకశ్మీర్, హర్యానా, ఢిల్లీకి చెందిన కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. జమ్ము కశ్మీర్ కు చెందిన ముగ్గురు అనుమానితుల అరెస్టు చేశారు. ఈ పేలుడుకు భారీ ఎత్తున అమ్మోనియం నైట్రేట్ వినియోగించినట్లు గుర్తించారు. ఉమర్ పుల్వామాకు చెందిన వ్యక్తి. గత నెలలో అమీర్ పేరుమీద వాహనం కొనుగోలు చేశాడు డాక్టర్. మధ్యాహ్నం 12 గంటలకు ఎఫ్‌సీఎల్ తొలి నివేదిక విడుదల చేయనున్నారు.
విద్యార్థి, వైద్యుల ముసుగులో ఉగ్ర కార్యకలాపాలు
ఢిల్లీ కారు పేలుడుకు ఫరీదాబాద్‌లో పట్టుబడ్డ JeM ఉగ్రవాదులకు లింకు ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి.
ఇటీవలే పట్టుబడ్డ డా.ముజ్జమిల్, డా.ఆదిల్ నుంచి భారీగా IED పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. 2500 కేజీల అమోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరితో డా.ఉమర్‌కు లింకులు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తూ కేసు దర్యాప్తు చేస్తున్నారు. వీరందరూ వైద్యుల ముసుగులో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు. మరికొందరు విద్యార్థి ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు ప్లాన్ చేస్తున్నారని అనుమానిస్తున్నారు. పేలుడు సమయంలో డా.ఉమర్ కూడా అమోనియం నైట్రేట్‌తో కారులో ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. కాగా, ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం చేసింది. పార్కింగ్ లోని వాహనాలనూ క్షుణ్నంగా తనిఖీ చేయాలని ఆదేశించింది.
……………………………………………………….
