ఆకేరు న్యూస్. హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ముందు మందకొడిగా ప్రారంభమైనా తొమ్మిది గంటల తరువాత పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సంఖ్య పెరుగుతూ కన్పించింది
నియోజకవర్గం మొత్తంలో 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు, మొత్తం 4.01 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుంది.
పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. వృద్ధులకు, వికలాంగులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలీసులు సహకరిస్తున్నారు. పోలింగ్ ముగిశాక ఈవీఎంలను యూసిఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో భద్ర పరుస్తారు. కౌంటింగ్
14 ఉదయం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం వరకు పూర్తి ఫలితాలు వెలువడవచ్చని భావిస్తున్నారు.
………………………………..
