* ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు
* మాయమై పోలేదు.. మనలోనే ఉన్నాడు అంటూ పాట పాడిన అభిమానులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రముఖ కవి అందెశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు తార్నాక,ఉప్పల్ మీదుగా ఘట్కేసర్ లో ని ఎన్ ఎఫ్ సీ నగర్ వరకు
ఘనంగా అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ అంతిమ యాత్రలో వేలాది మంది అభిమానులు కళాకారులు పాల్గొన్నారు. అంతిమ యాత్ర ఎన్ ఎఫ్ సీ నగర్ కు చేరుకున్న తరువాత సీఎం రేవంత్ రెడ్డి అందెశ్రీ పాడెను భుజాన ఎత్తుకున్నారు. అంత్యక్రియలు జరిగే వరకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,జూపెల్లి కృష్ణారావు,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అక్కడే ఉన్నారు. పోలీసులు గౌరవ వందనం తరువాత గాలిలోకి కాల్పులు జరిపారు. ఆ తరువాత అందెశ్రీ పార్థివ దేహాన్ని ఖననం చేశారు. అంతకు ముందు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆయన సతీమణిని సీఎం రేవంత్ ఓదార్చారు. అందెశ్రీ చివరి చూపు కోసం వేలాది మంది అభిమానులు, కళాకారులు శ్మశాన వాటిక వద్దకు చేరుకున్నారు. జోహార్ అందెశ్రీకి జోహార్ అంటూ నినాదాలు చేశారు.
……………………………………………
