* ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినందుకు గాను హీరో విజయదేవర కొండపై పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైన విషయం తెల్సిందే.. అయితే ఈ కేసును సీఐడీకి బదిలి చేశారు. ఈ క్రమంలో సీఐడీ అధికారులు విచారణకు హజరుకావల్సిందిగా విజయ్ దేవర కొండకు నోటీసులు జారీ చేశారు. మంగళవారం సీఐడీ అధికారుల ఎదుట హీరో విజయ్ దేవర కొండ హాజరయ్యారు. విజయ్ దేవర కొండ స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డు చేశారు. విచారణలో భాగంగా ఏ 23 గేమింగ్ యాప్ కంపెనీతో చేసుకున్న అగ్రిమెంట్ వివరాలను సీఐడీకి విజయ్ దేవరకొండ అందజేశారు. ఇదే కేసుకు సంబంధించి విజయ్ ఆగస్టు 6 న ఈడీ అధికారుల మందు హాజరయ్యారు.
……………………………………………………
