* పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
* గాంధీ భవన్ లో మీడియా సమావేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పదేళ్లూ మేమే అధికారంలో ఉంటామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన గాంధీ భవన్ లో విలేకరులతో మాట్లాడారు. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు. పదేళ్ల అధికారంలో ఉండబోతున్నాం అనడానికి జూబ్లీహిల్స్ విజయమే నాంది పలుకుతుందని అన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ రిగ్గింగ్ పాల్పడిందని ప్రతిఫక్షాలు చేస్తున్న విమర్శలను మహేశ్ కుమార్ తిప్పి కొట్టారు. ఓడిపోతున్నామనే బాధలో ప్రతిపక్షాలు అలా మాట్లాడుతున్నాయన్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకే
హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముందుకు వెళ్తామని మహేశ్ కుమార్ అన్నారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను చట్టబద్దత కల్పించాలనుకుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. కేబినెట్ విస్తరణ విషయం అధిష్టానం చూసుకుంటుందని పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
…………………………………………………….
