* నిన్న విజయదేవర కొండను విచారించిన అధికారులు
ఆకేరున్యూస్, హైదరాబాద్ : బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు విషయంలో నటుడు ప్రకాష్ రాజ్ సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈరోజు ఆయన సిట్ ముందుకు వచ్చారు. నిన్న హీరో విజయదేవర కొండను పోలీసులు విచారించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన ప్రకాష్‌రాజ్ మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్ యాప్ స్కాం విచారణ కోసం ఈడీ పిలవడంతో వచ్చానని తెలిపారు. ఒక యాప్ గురించి యాడ్ చేశానని, అప్పుడు అది బెట్టింగ్ యాప్ అని తెలియదని అన్నారు. తెలిసిన తర్వాత యాడ్ నుంచి తప్పుకున్నా అన్నారు. 2016-17లో బెట్టింగ్ యాప్స్ పై బ్యాన్ ఉందని, అంతకు ముందే ఓ యాప్ గేమ్ అనుకుని యాడ్ చేశానని అన్నారు. బెట్టింగ్ అని తెలిసి వదులుకున్నా అన్నారు. ఆ తర్వాత ఎటువంటి యాడ్స్ చేయలేదన్నారు. బెట్టింగ్ యాప్ ఈజ్ రాంగ్ అన్నారు. 2016లో మనకు తెలియదని, అవి బెట్టింగ్ యాప్ అని, బ్యాన్ అయ్యాయని స్పష్టం చేశారు. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే.. క్షమించాలని కోరినట్లు తెలిపారు. ఇటువంటి యాప్‌ల పట్ల యంగస్టర్స్ అప్రమత్తంగా ఉండాలని, వీటి వల్ల నష్టపోతామని సూచించారు. కష్టపడి పైకి రావాలన్నారు.
………………………………………………………
