* మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు : మేడారం జారత అభివృద్ధి పనులపై కొంత మంది రాజకీయం చేస్తున్నారని దేవతలపై జరిగే పనులను రాజకీయం చేయొద్దని మంత్రి సీతక్క అన్నారు. బుధవారం మేడారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియాసమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ అభివృద్ధి పనులపై అందరూ సహకరింంచాలని కోరారు, పత్రికల్లో కూడా ప్రజలను తప్పుతోవ పట్టించే విధంగా వార్తలు రాయకూడదని ఆమె కోరారు.పది తరాలకు పనికొచ్చేవిధంగా మేడారం పనులను పూర్తి చేస్తాం అని సీతక్క అన్నారు. సమ్మక్క సారక్కలు మహిమ గల దేవతలని తప్పుడు ప్రచారాలు మానుకోవాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి తరచూ మేడారం సందర్శించారని అందుకే ఆయన మేడారం అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని మంత్రి సీతక్క అన్నారు.
…………………………………………….
