* నాటి వరంగల్ కట్టడాలపై అధ్యయనం చేసి పుస్తకం రాసిన
సమాచార శాఖ జాయింట్ డెరెక్టర్ కన్నెకంటి వెంకటరమణ
* ఆవిష్కరించిన సి.ఎస్. రామకృష్ణారావు
హైదరాబాద్, నవంబర్ 12 : అసఫ్ జాహీల కాలంలో వరంగల్లో నిర్మించిన అద్భుత కట్టడాలు, పాలన తీరుపై సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకట రమణ రాసిన జ్యువెల్స్ ఆఫ్ ఆసఫ్ జాహీస్ ( JEWELS OF ASAF JAHI’S – the Glory of WARANGAL ) అనే కాఫీ టేబుల్ బుక్ ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు ఆవిష్కరించారు. బుధవారం డాక్టర్ . బీ.ఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన ఛాంబర్ లో రామకృష్ణారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ వరంగల్ నగరంలో అసఫ్ జాహీ హయాంలో నిర్మితమైన అద్భుత కట్టడాలు, వరంగల్ కేంద్రం గా పాలించిన సుబేదారుల వివరాలు వారి చరిత్రతో కూడిన ఈ కాఫి టేబుల్ బుక్ చరిత్ర పరిశోధకులకు, పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని సీ.ఎస్ రామకృష్ణారావు అన్నారు. పౌర సంబంధాల అధికారిగా విధులు నిర్వర్తిస్తూనే చారిత్రక అంశాలతో కూడిన ఈ కాఫీ టేబుల్ బుక్ ను వెలువరించడం అభినందనీయమని సీఎస్ ప్రశంసించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ సి.హెచ్. ప్రియాంక హాజరయ్యారు. సమాచార పౌర సంబందాల శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.

ఆసఫ్ జాహీల కట్టడాలపై ప్రత్యేక ఆసక్తి కలిగింది.
- కన్నెకంటి వెంకటరమణ
ఈ సందర్భంగా ఆకేరు న్యూస్ ప్రతినిధితో పుస్తక రచయిత కన్నెకంటి వెంకట రమణ మాట్లాడుతూ
వరంగల్ లో సుధీర్ఘకాలం పనిచేయడం వల్ల ఆసఫ్ జాహీల కట్టడాలు, పాలనపై ప్రత్యేక ఆసక్తి కలిగిందన్నారు.. అదే విదంగా వరంగల్ అంటే… కాకతీయుల పాలన, వేయిస్తంభాల ఆలయం, ఖిలా వరంగల్, భద్రకాళి ఆలయం స్పురిస్తాయి. వీటి ప్రత్యేకతలను , ఔన్యత్యాన్ని విస్మరించలేం అన్నారు.. కాకతీయుల కాలపు నిర్మాణాలు ఇంజనీరింగ్ అద్భుతాలు .. కాకతీయుల తర్వాత కాలంలో పాలనలోకి వచ్చిన ఆసఫ్ జాహీలు కూడా పాలనలో తమ ప్రత్యేకతను చూపేందుకు ప్రయత్నించారు.. అందులో భాగంగానే అనేక కట్టడాలు నిర్మించారన్నారు. వరంగల్ నగరంలో అడుగు పెట్టగానే కాజిపేట నుంచి మామునూర్ వరకు నిజాం నవాబులు నిర్మించిన అద్భుతమైన భవనాలు, కాజిపేట రైల్వే స్టేషన్, ప్రస్తుత మిషన్ భగీరథ పధకమైన ఇంటింటికి తాగునీరందించే ధర్మసాగర్ ఫిల్టర్ బెడ్ ఎన్నో ఉన్నాయని వెంకటరమణ చెప్పారు. వీటితోపాటు వరంగల్ కేంద్రంగా వరంగల్ సుబాహ్ గా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలోని కొన్నిప్రాంతాలు ఉండేవి. ఈ వరంగల్ సుబేదారులుగా ఎవరెవరు ఉన్నారు. వారి ప్రత్యేకతలేమిటి, ఈ విషయమై కొన్ని అరుదైన, విశేషాలతోకూడిన సమాచారంతో పాటు నిజాం నిర్మిత హెరిటేజ్ కట్టడాల ఫోటోలతో కలిపి జ్యువెల్స్ ఆఫ్ ఆసఫ్ జాహీస్ ( JEWELS OF ASAF JAHI’S – he Glory of WARANGAL ) కాఫి టేబుల్ బుక్ లో ఉంటుందన్నారు. ఈ పుస్తకం చరిత్ర పరిశోధకులకు , విద్యార్థులు, చరిత్రపై ఆసక్తి ఉన్న వారికి ఉపయోగపడుతుందని వెంకట రమణ చెప్పారు..

——————————————-
